ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నోటి దుర్వాసనకు చెక్ పెట్టండి

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Sep 19, 2022, 11:53 PM

నోటి దుర్వాసన చాలామందిలో కామన్‌గా వచ్చే సమస్య. దీని వల్ల నలుగురిలో సరదాగా మాట్లాడలేం. ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.ఈ సమస్యకు ప్రధాన కారణం.. నోటి శుభ్రత పాటించకపోవటమే కాబట్టి.. నోటి నుంచి దుర్వాసన రాకుండా చూసుకోవడం ప్రాథమిక పరిశుభ్రతలో ఒక భాగమని గుర్తించాలి. ఉదయం, రాత్రి చొప్పున రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. ముఖ్యంగా.. రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయడం తప్పనిసరి. పళ్లల్లో ఇరుక్కున పదార్థాలన్నీ బ్రషింగ్‌తో పోవు. అప్పుడు దారంతో పళ్లమధ్య ఉన్నవాటిని తొలగించాలి. రోజుకు ఒక్కసారైనా ఇలా చేయాలి.నోటిని డ్రైగా ఉంచుకోకూడదు. నీరు తగినంత తీసుకోవాలి. ఏదైనా తిన్న వెంటనే నీటిని పుక్కిలించి వేయాలి. ఇలా చేస్తే, నోటిని కడుక్కున్నట్టు అవుతుంది.కూల్ డ్రింక్స్, ఆల్కహాల్‌కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం కూడా నోటి దుర్వాసనకు కారణమవుతాయి. కాబట్టి వీటిని తగ్గించుకోవలి.టూత్ బ్రష్ ను ప్రతీ మూడు నెలలకు ఒకసారి మార్చడం మంచిది. కనీసం ఏడాదికి ఒకసారి అయినా డెంటిస్ట్ ను సంప్రదించడం మంచిది.ఆపిల్ లేదా క్యారట్లను రోజు తినాలి. వీటి వల్ల పళ్ళపై ఒత్తిడి పెరిగి, వాటిపై పేరుకున్న మలినాలు క్లీన్ అవుతాయి. ఫలితంగా నోరు శుభ్రంగా, తాజాగా ఉంటుంది.


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com