గోపవరం మండల తేదేపా ముఖ్యనేతల సమావేశం గోపవరం మండలం నీరుద్రాయపల్లె గ్రామంలో మండల తెదేపా అధ్యక్షులు మామిడి సుధాకరరెడ్డి అధ్యక్షతన గోపవరం జడ్పిటిసి సభ్యులు కలువాయి జయరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. సమావేశానికి బద్వేలు మాజీ శాసనసభ సభ్యురాలు విజయమ్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తేదేపా సభ్యత్వ నమోదు, బాదుడే-బాదుడు కార్యక్రమాల గురించి కార్యకర్తల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం ప్రతి కార్యకర్త సైనికునివలే పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. సమావేశంలో తేదేపా మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa