ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వద్దు... పెళ్లి కోసం నో అన్న అమ్మాయి

national |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 11:57 PM

ఇంటికి కాబోయే అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని పోటీ పడే ఈ రోజుల్లో వారు ఏ మాత్రం అవసరం లేదని వింత ప్రకటన చేసి ఓ యువతి వార్తలు నిలిచింది. తమకు కావల్సిన వరుడు, వధువు కోసం మ్యాట్రిమొనీ ప్రకటనలు ఇవ్వడం తెలిసిందే. తమ గుణగణాలు వెల్లడించి, ఎదుటివారి గుణగణాలు ఎలా ఉండాలో ఆ యాడ్ లో పేర్కొనడం సర్వసాధారణమైన విషయం. అయితే తనకు తగిన వరుడి కోసం ఓ అమ్మాయి ఇచ్చిన మ్యాట్రిమొనీ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 


అబ్బాయి తప్పనిసరిగా ఐఏఎస్/ఐపీఎస్/డాక్టర్ (పీజీ), ఇండస్ట్రియలిస్ట్/బిజినెస్ మేన్ అయ్యుండాలని ఆ అమ్మాయి పేర్కొంది. అది కూడా తమ కులానికి చెందినవాడే అయ్యుండాలని తెలిపింది. 


అయితే ఆ ప్రకటన చివర్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను ఉద్దేశించి ఓ హెచ్చరిక జారీ చేసింది. "సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు దయచేసి కాల్ చేయొద్దు... భవిష్యత్తులో ఐటీ రంగానికి ఏమంత గొప్ప రోజులు లేవు" అని స్పష్టం చేసింది. ఈ మ్యాట్రిమొనీ యాడ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com