కేరళలోని కన్నౌర్ కు చెందిన రాఘవన్ అనే కూలీ 52ఏళ్లుగా లాటరీ టికెట్లను కొంటన్నాడు. లాటరీల కోసం ఇప్పటివరకు ఏకంగా రూ.3.50 కోట్లు ఖర్చు చేశాడు. ఇప్పటివరకు లాటరీల్లో అతడు గెలుచుకున్న గరిష్ఠ బహుమతి కేవలం రూ.5వేలు మాత్రమే. కూలీ పనులు చేసే రాఘవన్ అదృష్టం వరించే రోజు కోసం ఎదురుచూస్తున్నాడు. ఎప్పటికైనా తన భర్తకు అదృష్టం కలిసొస్తుందని రాఘవన్ భార్య శాంత ఆశాభావంతో ఉంది.