త్రిపురాంతకం మండల పరిధిలోని ఎండూరివారిపాలెం గ్రామంలో పలువురు రైతులు 2019లో పరివర్తకాల కోసం విద్యుత్తు శాఖకు నిర్దేశిత రుసుం చెల్లించి దరఖాస్తు చేసి ఉన్నారు. ఉన్నతాధికారులు పరివర్తకాలను మంజూరు చేసి మూడేళ్లు అవుతున్నా అప్పగించకపోవడంతో విసిగిపోయిన అన్నదాతలు పోలీసు స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు గణపవరం మెట్ట వద్ద పరివర్తకాలు ఉన్నట్లు గుర్తించి వాటిలో 5 పరివర్తకాలను స్వాధీనం చేసుకుని రైతుల సహయంతో పోలీస్ స్టేషన్ కు తరలించారు.