కరాటే శిక్షణ పేరుతో పీఎఫ్ఐ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందించడంతో పాటు యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు వచ్చిన ఆరోపణల మేరకు ఎన్ఐఏ ఇవాళ కర్నూలు, గుంటూరు జిల్లాలోని పలుచోట్ల సోదాలు నిర్వహించింది. కర్నూలులోని ఖడక్పూర్ వీధిలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.ఎస్డీపీఐ నాయకుడి ఇంట్లో సోదాలు నిర్వహించి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి అధికారులు సోదాలు నిర్వహించారు. పాత గుంటూరులోని పలు ప్రాంతాలలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. పీఎఫ్ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)తో సంబంధం ఉన్న వారిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ సంస్థకు చెందిన కార్యాలయాలు, ముఖ్య నేతలు, కార్యకర్తల ఇళ్లలపై ఎన్ఐఏ మెరుపు దాడులు నిర్వహిస్తుంది.