అనంతపురం జిల్లా, తాడిపత్రి పట్టణం నాగులకట్ట సమీపంలోని ఓ ఇంట్లోకి ఈనెల 1 వ తేదీన ఇద్దరు దొంగలు ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులను కొట్టి కత్తితో బెదిరించి బంగారు గొలుసు, 4 బంగారు గాజులు (మొత్తం 10 తులాల బంగారు) ఎత్తుకెళ్లారు. బాధితులు తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషన్లో సమాచారం అందించిన తక్షణమే సిబ్బంది రాజశేఖర్ (పి.సి నంబర్ 3185), మహమ్మద్ రఫీ (పి.సి నంబర్ 1024) స్పందించారు. గాలించి ఆ ఇద్దరు దొంగలను పట్టుకుని ఎత్తుకెళ్లిన 10 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేసి బాధితులకు ముట్టజెప్పారు
తాడిపత్రికి ఈ రోజు వెళ్లిన జిల్లా ఎస్పీ గారిని తాడిపత్రి ఆర్య వైశ్య సంఘం నాయకులు కలిశారు. ఆపద సమయంలో తక్షణమే స్పందించి ప్రాణాలు కాపాడటం, దొంగను పట్టుకోవడం, సొత్తు రికవరీ చేయడాన్ని గుర్తు చేస్తూ సంతృప్తి వ్యక్తం . చేయడంతో పాటు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్పీతో పాటు కానిస్టేబుళ్లు రాజశేఖర్ , మహమ్మద్ రఫీలను సత్కరించారు.