యూపీలోని ఘజియాబాద్ సమీపంలో దారుణం జరిగింది. మోడినగర్లోని ఖిడోడా గ్రామంలో గఫార్ అనే వ్యక్తి తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు. అస్వస్థత తలెత్తడంతో తన భర్తతో కలిసి ఓ మహిళ అక్కడకు వెళ్లింది. దెయ్యం పట్టిందని, భూత వైద్యం చేస్తానని గఫార్ నమ్మించాడు. ఆపై మహిళపై అత్యాచారం చేశాడు. బాధితురాలు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.