ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఏపీ సర్కారు పేరు మార్చడంపై ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ తాజాగా స్పందించారు. మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ పేరు కాదని, తెలుగువారి వెన్నెముక అన్నారు. తండ్రి గద్దెనెక్కి ఎయిర్పోర్టు పేరు మార్చితే, కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మార్చారన్నారు. 'పంచభూతాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త.. మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు' అంటూ జగన్ను ఉద్దేశిస్తూ విమర్శించారు.