జగన్ రెడ్డి పాలనలో జర్నలిజానికి సంకెళ్లు వేస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా చీకటి జీవో తీసుకొచ్చారు అని నారా లోకేష్ ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టి పాత్రికేయులను అరెస్ట్ చేస్తున్నారు. ఇంకెంత కాలం ఈ నిరంకుశత్వం. వాట్సాప్ లో వార్త పోస్ట్ చేశారని సీనియర్ పాత్రికేయులు అంకబాబు గారిని అరెస్ట్ చేయడమే అన్యాయం అనుకుంటే ఇప్పుడు ఆయనకు మద్దతుగా గళం విప్పిన సాటి జర్నలిస్టులను వేధించడం ఇంకా దారుణం. అంకబాబు అరెస్ట్ ని, పత్రికా స్వేచ్ఛని హరిస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహా టీవీ ఎండి వంశీ తో పాటు పలువురు జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తక్షణమే అరెస్ట్ చేసిన జర్నలిస్టులను విడుదల చెయ్యాలి అని డిమాండ్ చేసారు .