అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది. క్యాంప్‌బెల్ బే తీరంలో భూమి తీవ్రస్థాయిలో కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. దీని వల్ల ఏర్పడిన ప్రాణ, ఆస్తి నష్టంపై వివరాలు ఇంకా తెలియలేదని తెలిపింది. అండమాన్ దీవుల్లోనే దిగ్లీపూర్ సెప్టెంబర్ 2న కూడా రిక్టర్ స్కేల్‌పై 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.