గుంటూరు: నల్లపాడు లో సాధనాల అరుణ (24) అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. 2018లో వెల్దుర్తి మండలం బోదలవీడుకు చెందిన సాదనాల సుధాకర్ తో ఆమెకు వివాహం అయింది. అయితే అదనపు కట్నం కోసం సుధాకర్ భార్యను వేధిస్తూ కొట్టేవాడు. దీంతో అరుణను తీసుకు వెళ్లడానికి తల్లి వచ్చింది. ఈ క్రమంలో సుధాకర్ భార్యను కొడుతూ ఇంట్లోకి తీసుకెళ్లాడు. అయితే 20 నిమిషాల అనంతరం అరుణ ఫ్యాన్ కు ఉరి వేసుకుని మృతి చెందిందని సుధాకర్ చెప్పాడు.