ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2. 340 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు రెండు లక్షల బోర్లు ఉచితంగా ప్రభుత్వం వేయించిందని రైల్వేకోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఉప్పరపల్లి నందు వైయస్సార్ జలకళ ద్వారా వేసిన నీటి బోరు బావిని ప్రభుత్వ విప్ కొరముట్ల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజమ్ సుకుమార్ రెడ్డి, జడ్పీటీసీ రత్నమ్మ, సర్పంచ్ పెంచల్ రెడ్డి, ఉపసర్పంచ్ వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ మహేష్, ఈఓపిర్డి నాగార్జున, జిల్లా నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.