వరుసగా నాలుగో రోజు సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల బాట పట్టాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 312 పాయింట్లు, సెన్సెక్స్ 970 పాయింట్లు తగ్గాయి. ఈక్విటీల పతనం వల్ల ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ రూ.7 లక్షల కోట్ల మేర తగ్గిపోయింది. అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తీవ్ర నష్టాల మధ్య స్టాక్ మార్కెట్లు గత నాలుగు రోజుల నుంచి కొట్టుమిట్టాడుతున్నాయి.