నెల్లూరు దుర్గా మిట్టలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం రాజరాజేశ్వరి అమ్మవారు చండీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి ప్రాంగణంలో అష్టాదశ శక్తి పీఠాలైన శ్రీ శాంకారీదేవి (శ్రీలంక ), కాంచీపురం కామాక్షి దేవి అలంకరణ నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి గిరి కృష్ణ, ఆహ్వాన కమిటీ చైర్మన్ అళహరి విజయ్ కుమార్ తదితరులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.