ప్రతిపక్షాలు సమరశంఖం పూరించినా రానున్న ఎన్నికల్లో వైసీపీదే విజయమని మాజీ హోంమంత్రి సుచరిత అన్నారు. గుంటూరులో ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఎన్టీఆర్ అంటే గౌరవం వల్లే ఆయన పేరుతో ఒక జిల్లాకి నామకరణం చేశామన్నారు. ఆరోగ్యశ్రీ లాంటి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం వల్లే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పు జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ వైసీపీకి 65 సీట్లు వస్తాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.