విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలో జీవీఎంసీ 13వ వార్డు పైనాపిల్ కాలనీ సచివాలయం పరిధిలో జెఎన్ ఆర్ ఎం కాలనీ పరిధిలో 13వ వార్డ్ కార్పొరేటర్ కెల్లా సునీత సత్యనారాయణ ఆధ్వర్యంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం రాత్రి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల పాల్గొన్నారు ప్రతి గడపలకు వెళ్లి ప్రజలు కష్టాలు తెలుసుకున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎవరికైనా అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు రాకపోతే కచ్చితంగా వారికి పథకాలు అందే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా స్థానికంగా ఉండే సమస్యలన్నీ కూడా ప్రజలను అడిగి తెలుసుకు న్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వలం టీర్లు, ఆర్పీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.