దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఎయిర్ హోస్టెస్‌పై అత్యాచారం జరిగింది. ఖాన్పూర్ నివాసి అయిన హర్జీత్ యాదవ్ రాజకీయ నాయకుడు. మద్యం మత్తులో ఆదివారం ఎయిర్‌హోస్టెస్ ఇంట్లో దూరి అత్యాచారం చేశాడు. క్రుంగిపోయిన బాధితురాలు చివరికి నిందితుడు ఉన్న గదికి గడియ పెట్టింది. ఆపై పోలీసులకు ఫోన్ చేసి, జరిగిన దారుణాన్ని వివరించింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.