గ్యాంగ్స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్నను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమచారంతో పోలీసులు శేషన్నను అరెస్ట్ చేశారు. 2016లో గ్యాంగ్స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ తరువాత అతని కొంతమంది అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో నయీం ప్రధాన అనుచరుడు శేషన్నకూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసుల కళ్లుకప్పి తిరుగుతున్నాడు. రహస్యంగా దందాలు..సెటిల్ మెంట్లు చేస్తున్నాడు. ఈక్రమంలో శేషన్న జాడల్ని పసిగట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. శేషన్న వద్ద ఉన్న 9 MM పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు.
కొంతకాలంగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్న శేషన్న సోమవారం (సెప్టెంబర్ 26,2022)కొత్తపేట్ లోని ఒక హోటల్లో సెటిల్మెంట్ చేస్తున్నాడనే సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ఆకస్మిక దాడులు చేశేషన్నను అదుపులోకి తీసుకున్నారు. శేషన్న అరెస్టును మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లుగా సమాచారం. నాంపల్లి కోర్టులో శేషన్నను హాజరుపర్చి రిమాండ్కు తరలించనున్నారు.