ఏపీలో మద్యం అమ్మకాల్లో ఎక్సైజ్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ స్పిరిట్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టింది. పిటిషన్ లో చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో పిటిషన్ను కొట్టివేసింది. కాంపిటీషన్ లాను ఉల్లంఘించినట్టు నిర్ధారణ కాలేదని, ఎక్సైజ్ చట్టం సెక్షన్-4 ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది.