దళితులపై దాడులు, మహిళలపై అఘాయిత్యాలు, బాదుడే బాదుడు, అక్రమ మైనింగ్, ఎన్టీఆర్ పేరు మార్పు, లిక్కర్ స్కాం.. ఇలా కేవలం ఇష్యూస్ మీద పోరాడుతుంది తెలుగుదేశం పార్టీ అని టీడీపీ నాయకులూ అచ్చేమ్ నాయుడు తెలిపారు. టీడీపీ అధినాయకులు నారా చంద్రబాబు పై సోషల్ మీడియా లో వస్తున్నా వార్తలపై, తాయారు చేస్తున్న పోస్టర్ లపై స్పందిస్తూ... వైఎస్సార్సీపీలా ఇంత దిగజారుడు రాజకీయాలు చేయదు. అసెంబ్లీలో, బయట,సోషల్ మీడియాలో ఇటువంటి వ్యాఖ్యలు చేయిస్తున్న జగన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఒక్కటే. ఇటువంటి చర్యలు సభ్య సమాజమే కాదు, నీ కుటుంబ సభ్యులు కూడా హర్షించరు. దేవుడు మీరు చేస్తున్న ఈ పాపాలకు శిక్ష ఈ జన్మలోనే వేస్తాడు. తెలుగుదేశం కార్యకర్తలకు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ లకు నా విన్నపం. దయచేసి మీరందరూ సంయమనంతో వ్యవహరించండి. మనం వైసీపీ వారి స్థాయికి దిగజారవద్దు. ఇటువంటి చర్యలకు పాల్పడవద్దు. తెలుగుదేశం పార్టీ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తుంది, సమస్యలపైనే పోరాడుతుంది అని తెలియజేసారు. ఏది ఏమైనా ఇలాంటి సంస్కృతీ మంచి పద్దతి కాదేమో ఆలోచించండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa