కొబ్బరినూనెలో కరివేపాకు కలిపి తలకు రాస్తే జుట్టు బలంగా, ఒత్తుగా మారుతుంది. ఉల్లిపాయ రసాన్ని మెత్తగా రుబ్బిన కరివేపాకును కలిపి మాడుకు పట్టించి, గంట తర్వాత షాంపూతో కడిగేస్తే తల నెరవడం, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతాకులు, కరివేపాకు కప్పు చొప్పున తీసుకుని మెత్తగా రుబ్బి, దానికి 2 స్పూన్ల ఉసిరి పొడి కలిపి మాడుకు రాసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే జుట్టు పెరుగుతుంది, దృఢంగా తయారవుతుంది.