బొబ్బిలి పురపాలక సంఘ కార్యాలయంలో కమీషనర్ యస్. శ్రీనివాసరావు అధ్యక్షతన ఎక్షిక్యుటివ్ ఇంజనీర్, పబ్లిక్ హెల్త్, విజయనగరం, అసిస్టెంట్ ఇంజనీర్, పబ్లిక్ హెల్తు మరియు పైప్ లైన్ కాంట్రాక్టర్ కె. కన్నబాబు తో సమీక్షా సమావేశం నిర్వహించారు. బొబ్బిలి – బలిజిపేట రోడ్డు విస్తరణలో భాగంగా ఇప్పటికే విద్యుత్ స్తంభములు మార్పు చేయడం జరిగిందని, కాలువల నిర్మాణం కుడా చివరి దశలో ఉన్నందున పైప్ లైన్ వేయడం కొరకు టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ వారికి త్వరితగతిన పైప్ లైన్ పనిని ప్రారంభించి 10 నుండి 15 రోజులలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవలసినదని మునిసిపల్ కమీషనర్ యస్. శ్రీనివాసరావు ఆదేశించారు.