ఢిల్లీసీఎం కేజీవాల్ సీబీఐపై సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా పేరు చెప్పాలని విజయ్ నాయర్‌పై సీబీఐ ఒత్తిడి చేసిందని ఆరోపించారు. అందుకు ఒప్పుకోకపోవడంతో అతన్ని అరెస్టు చేశారని విమర్శించారు. గుజరాత్ ఎన్నికల భయంతోనే బీజేపీ ఇదంతా చేస్తుందని అన్నారు. విజయ్ నాయర్ ఆప్ సామాన్య కార్యకర్త అని చెప్పారు.