మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వసాయి ప్రాంతంలో బుధవారం ఒక కర్మాగారంలో బాయిలర్ పేలి మంటలు చెలరేగడంతో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారు మరియు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలో 50 మంది ఉద్యోగులు పని చేస్తున్న సమయంలో బాయిలర్ పేలింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.ముగ్గురు కార్మికులు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. మరో ఎనిమిది మందికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి.క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.