భారతదేశానికి అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి నియమితులయ్యారు.సెప్టెంబరు 30తో పదవీకాలం ముగియనున్న ప్రస్తుత ఏజీ కేకే వేణుగోపాల్ నుంచి వెంకటరమణ బాధ్యతలు స్వీకరించనున్నారు.ఈ మేరకు లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌ను ప్రచురించింది.వెంకటరమణి ఏప్రిల్ 13, 1950న పాండిచ్చేరిలో జన్మించారు.వెంకటరమణి 2010 మరియు 2013లో భారత లా కమిషన్ సభ్యునిగా పనిచేశారు.