కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి కార్లలో 6 ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి రూల్ ను అమల్లోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్యాసింజర్ కార్లలో, ఎం-1 క్యాటగిరీ కార్లలో ఇక నుంచి 6 ఎయిర్బ్యాగ్స్ ఉండాలని చెప్పారు. ఎంత ఖరీదైన కార్లైనా లేక వేరియంట్లైనా ఇది తప్పనిసరి అని చెప్పారు.