ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుజరాత్‌లో జాతీయ క్రీడలను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

national |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 08:29 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 36వ జాతీయ క్రీడలను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. గుజరాత్‌లోని 6 నగరాల్లో జాతీయ క్రీడలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబరు 12 వరకు ఈ ఉత్సవం జరగనుంది.కేరళలో చివరిసారిగా 2015లో 35వ జాతీయ క్రీడలు జరగ్గా.. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల జాతీయ క్రీడలు నిర్వహించడం కుదరలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత జాతీయ క్రీడలు జరగనున్నాయి. 36వ జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని కేంద్రం గుజరాత్‌కు అప్పగించింది. 36 క్రీడాంశాల్లో ఈ పోటీలు జరగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa