తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీలోని అన్ని నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జ్‌లతో చంద్రబాబు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా గురువారం ఆయన 6 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.గురువారం విజయవాడ తూర్పు, చీపురుపల్లి, రాయదుర్గం, సాలూరు, యర్రగొండపాలెం, మచిలీపట్నం నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో చంద్రబాబు సమావేశమయ్యారు.