దమ్ముంటే మీ రాష్ట్రమైన బీహార్ లో ఆర్ఎస్ఎస్ ను నిషేధించి చూడండి అంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సవాల్ విసిరారు. ఇదిలావుంటే విద్వేషాలను రెచ్చగొట్టే అన్ని సంస్థలను నిషేధించాలని... పీఎఫ్ఐ మాదిరే ఆరెస్సెస్ ను కూడా బ్యాన్ చేయాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. ఆరెస్సెస్ వాలంటీర్ నని చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తానని చెప్పారు. మరి పీఎఫ్ఐ సభ్యుడినని లాలూ చెప్పుకోగలరా? అని ప్రశ్నించారు. బీహార్ లో ప్రస్తుతం వారి ప్రభుత్వమే ఉందని... దమ్ముంటే ఆ రాష్ట్రంలో ఆరెస్సెస్ ను లాలూ నిషేధించాలని సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.