ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మాకొద్దు ఈ ఉచితబస్సు.. టికెట్ కొనుక్కుంటాం'.. రోడ్డెక్కిన మహిళలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 29, 2026, 04:00 PM

AP: అనంతపురం జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళలు తీవ్ర నిరసన తెలిపారు. తమకు ఫ్రీ బస్ అవసరం లేదని, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కునే స్తోమత ఉందని వారు పేర్కొన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు తమను చూసి బస్సులు ఆపకుండా వెళ్లిపోతున్నారని, అధికారులు, సిబ్బంది చులకనగా చూస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఈ పథకంపై మహిళల నుంచి విశేష స్పందన లభిస్తున్నప్పటికీ, అనంతపురం మహిళలు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa