అక్టోబర్ 1, 2023 నుండి ఎనిమిది సీట్ల కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబరు 1 తర్వాత తయారయ్యే ఎనిమిది సీట్ల వాహనాలకు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరిగా అమర్చాలని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ జనవరిలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.