మహారాష్ట్రలోని పాల్ఘర్ లో కృష్ణ అనే యువకుడు తన ప్రేయసి నేహాను గన్ తో కాల్చి చంపాడు. టిమా ఆస్పత్రి వద్ద బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. యువతి అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడు పారిపోతుండగా అతడిని ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ప్రేమ వ్యవహారంలో గొడవ రావడమే హత్యకు కారణంగా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.