భీమవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో భీమవరం పట్టణం బి. వి. రాజు పార్క్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహంవద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలో మూడవరోజు భీమవరం మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు రేవు వెంకన్న ఆధ్వర్యంలో మండల పార్టీ నాయకులు రాష్ట్ర గవర్నర్‌కి వ్రాసిన పోస్ట్ కార్డులను ప్రదర్శిస్తూ రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు.
ఈకార్యక్రమంలో పాల్గొన్న జిల్లాపార్టీ అధ్యక్షురాలు నియోజకవర్గ ఇన్చార్జి తోట సీతారామలక్ష్మి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాలి అర్పించిన అనంతరం మాట్లాడుతూ మడమ తిప్పను మాట తప్పను అని అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజావేదికని కూల్చడం, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలకు రంగులు మార్చడమే కాకుండా విశ్వవిద్యాలయాల పేర్లు కూడా మారుస్తూ దుర్మార్గపు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.