అన్నమయ్య జిల్లా నందలూరు మండలం చింతకాయల పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గంగి నాయుడు ఆధ్వర్యంలో చింతకాయల పల్లి గ్రామస్తుల పలు సమస్యల రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి దృష్టికి శుక్రవారం రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయం నందు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆ సమస్యలపై వెంటనే స్పందించి, అన్ని సమస్యలు త్వరగా పూర్తయ్యలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చింతకాయ పల్లి గ్రామానికి చెందిన మహిళలు మరియు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.