కమలాపురంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కమలాపురం తాడిపత్రి జాతీయ రహదారి పై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కమలాపురం అప్రోచ్ రోడ్డు వర్షం ధాటికి నీటి ప్రవాహానికి కోతకు గురై గుంతలు గుంతలుగా ఏర్పడి సిమెంట్ రోడ్డు సైతం పగుళ్ళు ఏర్పడి నెరలు నేరలలుగా చీలిపోవడంతో రహదారిపై ప్రయాణిస్తున్న భారీ వాహనాలు, బస్సులు, ఆటోలు, గుంతల్లో ఇరుక్కొని ద్విచక్ర వాహనాలల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సైతం తీవ్ర అవస్థలకు గురవుతున్నారు అని తెలుగుదేశం పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్ భాష, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు అంకిరెడ్డి డిమాండ్ చేశారు.
అప్రోచ్ రోడ్డును పరిశీలించిన టిడిపి నాయకులు అనంతం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తక్షణమే ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అప్రోచ్ రోడ్డు పై ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజా సమస్యలు పరిష్కరించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయబడిన పాలిటెక్నిక్ కళాశాల భవనం ప్రారంభోత్సవానికి కమలాపురంకి విచ్చేసిన ఎమ్మెల్యేకి అప్రోచ్ రోడ్డు ఏ స్థాయిలో ప్రమాదానికి గురైందో కనబడ లేదా అని ప్రశ్నించారు.
దాదాపు రూ. 6 కోట్ల 50 లక్షల ప్రజాధనంతో నిర్మించిన అప్రోచ్ రోడ్డు నాసిరకమైన పనులతో నిర్మించి ఇదివరకే రెండు సార్లు కోతకు గురై మరోసారి ప్రమాదపు అంచుల్లో ఉంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే కమలాపురం అప్రోచ్ రోడ్డు పనులను మరమ్మతులు చేయించి, శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.