వేంపల్లి పట్టణంలోని రాజీవ్ కాలనీలో వీధుల్లో సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అన్నారు. నిర్మాణం చేపట్టాలని వేంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రవిశంకర్ రెడ్డికి శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ నేటికీ సిసి రోడ్ల కొరతతో నాన్నఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికరాజీవ్ నగర్ కాలనీప్రజలు వైసీపీ ప్రభుత్వం వచ్చిననాటి నుండి ఎన్నిసార్లు అధికారులకు నాయకులకు చెప్పినాకూడా పట్టించుకున్నపాపాన పోలేదుఅంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు జిల్లాకో-కన్వీనర్ దాదాపిర్ జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా అన్నారు. రాజీవ్ కాలనీ ప్రజల ఇబ్బందులు మహాప్రభు అంటే పట్టించుకోని నాయకులు లేరన్నారు. తమ పార్టీ ప్రభుత్వ పాలన గురించి డబ్బులు కొట్టుకుంటున్నారు తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాజీవ్ కాలనీలో సిసి రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు.