ముందు మీరు ఇతరుల కుటుంబాల్లో మహిళలను గురించి అసభ్యంగా మాట్లాడతారు. ఆ చెత్త వాగుడుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే సరికి, దాన్ని కవర్ చేసుకోవడానికి సొంత వాళ్ళ మీదే పోస్టులు వేయించుకొని సానుభూతి నాటకాలు ఆడతారు అని టీడీపీ నాయకులూ , వైసీపీ నాయకులని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో సీఎం జగతాం సతీమణి భారతి మీద అలానే విజయమ్మ మీద వచ్చిన పోస్టర్ల మీద స్పందిస్తూ... ఆ పోస్టులు వేసింది ప్రతిపక్షం అని మాపై బురద జల్లుతారు. ఈ సీఐడీ వాళ్ళు మీకనుకూలంగా మీరు ఎప్పుడు చెబితే అప్పుడు ప్రతిపక్ష నాయకులను వేధించడానికి బయలు దేరుతారు అని వాపోయారు. కానీ ఈలాంటివి మేము చెయ్యము, మాది అంతటి నీచ సంస్కృతి కాదు అని టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ వివరించారు.