రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గుజరాత్లో గాంధీజీ నివాసం ఉన్న సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె చరఖా తిప్పి నూలు వడికారు. ఈ సందర్భంగా ఆమె ... ‘‘నేను గతంలో చరఖా తిప్పాను. కానీ, సబర్మతి ఆశ్రమంలో ఈ అనుభవం నా మనసును హత్తుకుంది. గాంధీజీ సిద్ధాంతాల్లోని అంతరార్థం తెలిసింది. అప్పటికీ.. ఇప్పటికీ ఎలాంటి మార్పులేని ఆశ్రమ పరిసరాలను చూస్తే ఆయన అక్కడే ఉన్నట్లుగా అనిపిస్తోంది’’ అంటూ ట్విటర్లో తన అనుభూతిని పంచుకున్నారు.