జనాభా నియంత్రణ కోసం భారతదేశానికి ఒక విధానం అవసరమనిఆర్‌ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్నారు. జనాభా నియంత్రణ విధానం అందరికీ సమానంగా వర్తించేలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. విజయదశమి ప్రసంగంలో మత ఆధారిత అసమతౌల్యత, బలవంతపు మార్పిడులతో దేశ విభజనకు దారితీసే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మత ఆధారిత అసమతుల్యౌత కారణంగా తూర్పు తైమూర్, కొసావో, దక్షిణ సూడాన్‌లను కొత్త దేశాలుగా అవతరించాయని పేర్కొన్నారు.
‘‘జనాభా నియంత్రణతో పాటు మత ప్రాతిపదికన సమతుల్యౌత అనేది కూడా విస్మరించలేని ముఖ్యమైన అంశం’’ అన్ని అన్నారు. ‘‘జనాభాకు వనరులు అవసరం, లేదా అది భారం అవుతుంది.. జనాభా ఒక ఆస్తి కాగలదనే అభిప్రాయం ఉంది.. మనం రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని ఒక విధానంపై పని చేయాలి’’ అని సూచించారు.
ప్రసవానికి సంబంధించిన ఏ పాలసీలోనైనా మహిళల ఆరోగ్యాన్ని ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలని ఆయన అన్నారు. కాగా, తొలిసారి ఆర్‌ఎస్‌ఎస్ దసరా వార్షిక కార్యక్రమానికి తొలిసారి మహిళను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. పర్వతారోహకురాలు సంతోష్ యాదవ్ హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థల కీలక ఎజెండాను పునరుద్ఘాటించిన మోహన్ భగవత్.. . ‘‘జనన రేటు ఒక కారణ బలవంతంగా, ఎర వేసి లేదా దురాశతో మతమార్పిడులు, చొరబాట్లు కూడా పెద్ద కారణాలు’’ అని ఆయన అన్నారు.
ఇదిలావుంటే జనాభా నియంత్రణ చట్టాన్ని బీజేపీ సభ్యులు, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు పదే పదే ప్రతిపాదించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అటువంటి చట్టం కోసం రాజ్యసభ సభ్యుడు రాకేష్ సిన్హా ప్రవేశపెట్టిన ప్రయివేట్ బిల్లుపై కేంద్ర ఆరోగ్య మంత్రి మనుసుఖ్ మాండవీయా మాట్లాడుతూ.. కుటుంబ నియంత్రణ, మెరుగైన ఆరోగ్య సంరక్షణ ఏమైనప్పటికీ జనాభా స్థిరీకరణకు హామీ ఇచ్చిందని అన్నారు. ‘‘మొత్తం సంతానోత్పత్తి రేటు దాదాపు 2%కి తగ్గింది... కుటుంబ నియంత్రణ మిషన్ విజయం దిశగా పయనిస్తోందని ఇది మాకు తెలియజేస్తుంది’’ అని మంత్రి చెప్పారు. దీంతో తర్వాత తన బిల్లును సిన్హా ఉపసంహరించుకున్నారు. విపక్ష సభ్యులు కూడా కుటుంబ నియంత్రణను బలవంతంగా చేయకూడదని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa