సాహసం చేయర డింబక అన్నది అతను పాటించాడు. ఏకంగా రెండు వందల లాటరీ టిక్కెట్లు కొన్నాడు. లక్ కూడా అతడిని వెంటాడింది. ఏకంగా . ఏకంగా 10 లక్షల డాలర్ల వర్షం కురిపించింది. తన పుట్టినతేదీ, సంవత్సరం కలిపిన నంబర్ తో లాటరీ టికెట్లు కొన్న వ్యక్తికి బంపర్ బహుమతి కలిసి వచ్చింది. అయితే ఏదో ఒక టికెట్ కొనకుండా.. ఏకంగా 200 టికెట్లు కొన్నాడు. ఒక్కో టికెట్ కు ఒక్కో డాలర్ చొప్పున 200 డాలర్లు పెట్టి టికెట్లు కొంటే.. ఏకంగా 10 లక్షల డాలర్లు (మన కరెన్సీలో రూ. 8 కోట్లకుపైనే) బహుమతి రావడం గమనార్హం. అమెరికాలోకి అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన ఆయన పేరు అలీ. తాను అన్నీ 0-2-6-5 నంబర్ సిరీస్ ఉన్న లాటరీ టికెట్లు కొని జాక్ పాట్ కొట్టాడు. ఈ రెండు వందల టికెట్లకు ఒక్కోదానికి 5 వేల డాలర్ల చొప్పున బహుమతి తగిలింది. అంటే మొత్తం కలిపి 10 లక్షల డాలర్లు అన్నమాట.
అమెరికాలో జరిగే లాటరీ టికెట్లలో సిరీస్ తరహా డ్రాలు తీస్తుంటారు. ఉదాహరణకు కేవలం మూడు సంఖ్యల లాటరీ అనుకుంటే.. ఎన్ని వేలు, లక్షల లాటరీ టికెట్లు అమ్మినా కూడా.. వాటిలో.. సదరు డ్రాలో తీసిన చివరి మూడు సంఖ్యలు ఉన్న టికెట్లు అన్నీ కూడా బహుమతికి ఎంపిక అవుతాయన్నమాట. అలీ తాను కొన్న మొత్తం 200 టికెట్లు కూడా చివరన ఒకే నంబర్ వచ్చేలా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అలీకి కొన్న మొత్తం టికెట్లకు బహుమతి తగలడం గమనార్హం.
అయితే లాటరీ తగలడం అనేది అత్యంత అరుదైన విషయం. లక్షల మంది లాటరీ టికెట్లు కొంటుంటే.. అందులో ఏ ముగ్గురు, నలుగురికో అదృష్టం కలిసి వస్తుంది. ఇది వ్యసనంగా మారే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే చాలా దేశాలు లాటరీలను నిషేధించాయి. అమెరికాలో మాత్రం కొన్ని రాష్ట్రాల్లో లాటరీలకు అధికారికంగానే అనుమతులు ఉంటాయి.