ఇంకొల్లు సీఐ రంగనాథ్ బాబును శింగరాయకొండకు బదిలీ చేశారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. చినగంజాం మండలం మూలగాని వారి పాలెంకు చెందిన ఆర్మీ జవాన్ అక్కల సూర్యప్రకాశ్ రెడ్డి ఆత్మహత్య కేసులో ఇంకొల్లు సీఐ రంగనాథబాబు నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల ఆర్మీ జవాన్ కుటుంబసభ్యులు నాలుగురోజులు ఆమరణ దీక్ష సాగించడం విదితమే. తదుపరి ప్రత్యేక దర్యాప్తు అధికారి లక్ష్మయ్యఈ కేసులో సీఐ పాత్రపై ఆ గ్రామంలో బహిరంగ విచారణ జరిపారు. ఆ తరువాత రంగనాథ్ బాబును బదిలీ చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.