బ్రహ్మంగారిమఠం పుణ్యక్షేత్ర పవిత్ర ప్రాంతాలలో ఉన్న ఊర పందులను పంచాయతీ అధికారులు, మండల అభివృద్ధి అధికారుల సమక్షంలో పట్టివేత కార్యక్రమం చేపట్టారు. ఇటీవల ఊర పందుల దాడిలో ఓ వృద్ధురాలు మృతి చెందడంతో పందుల యజమానులపై చర్యల్లో భాగంగా పుణ్యక్షేత్ర ప్రాంతాలలో ఊర పందులను ఉండకుండా గట్టి చర్యలు చేపట్టారు. అధికారుల ఆదేశాల ప్రకారం పందుల యజమానులు స్పందించి అందులోను పట్టివేత కార్యక్రమం చేపట్టారు. అధికారులు తీసుకున్న నిర్ణయం పట్ల స్థానికులు భక్తులు హర్షం వ్యక్తం చేశారు.