కావలసిన పదార్థాలు:
బీట్రూట్ ముక్కలు: ఒక కప్పు, పాలు: పావు కప్పు, ప్రాసెస్డ్ చీజ్: 50 గ్రా., మిరియాల పొడి: ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు: రెండు, ఉప్పు: తగినంత, నిమ్మరసం: ఒక టీ స్పూన్
తయారీ విధానం:
ముందుగా స్టవ్‌మీద ప్యాన్ పెట్టి బీట్రూట్ ముక్కలు, పాలు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. మగ్గిన బీట్రూట్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని సన్నగా తరిగిన చీజ్, మిరియాల పొడి, వెల్లుల్లి తురుము వేసి బాగా కలుపుకొని చివరగా నిమ్మరసం వేయాలి. కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్ చేసుకుంటే చీజ్ బీట్రూట్ సలాడ్ రెడీ.