గుంటూరు: మాచవరం పట్టణంలో ద్విచక్ర వాహనదారుడు సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని మాచవరం ఐసిఐ కోటయ్య హెచ్చరించారు. శుక్రవారం మాచవరం బస్టాండ్ సెంటర్లో వాహనాలను తనిఖీ నిర్వహించారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.