కృష్ణాజిల్లా మచిలీపట్నoలో శుక్రవారం ప్రజా రవాణా శాఖ కార్యాలయంలో ఏపీఎస్ఆర్టీసీ జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం జిల్లావ్యాప్తంగా 164 బస్సులను హైదరాబాద్ విశాఖపట్నం పలాస చెన్నై బెంగళూరు తిరుపతి వంటి ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేయటం జరిగిందని తద్వారా మూడవ తేదీ నుండి 7వ తేదీ వరకు 40 లక్షలు పైగా ఆదాయం ఆర్టీసీకి వచ్చిందని కిలోమీటర్ కి 35 రూపాయల చొప్పున 98 వేల కిలోమీటర్లు బ్రేజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ బస్సులు తిరిగినవని తెలిపారు. ఆర్టీసీ ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తుందని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమల రావు గారి సూచనలను అనుసరించి తిరుగు ప్రయాణంలో ప్రత్యేకంగా 170 బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని లోకల్ న్యూస్ కి ప్రత్యేకంగా తెలియజేశారు