పల్నాడు జిల్లా రెంటచింతలలో ఆదివారం దారుణం జరిగింది. స్థానిక గిరిజన హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్న బాలికను హాస్టల్ వార్డెన్ తల్లిని చేశాడు. విద్యార్ధినిని మాయమాటలతో లోబరుచుకుని. గత కొంతకాలంగా ఆమెను అనుభవిస్తున్నాడు. బాలిక గర్భందాల్చడంతో అబార్షన్ చేయించాడు. హాస్టల్లో విద్యార్ధిని కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.