రేపల్లె నియోజకవర్గం లోని మండలాల్లో ఆదివారం కురిసిన వర్షాలకు నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రేపల్లెలో 13. 2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు అవ్వగా నిజాంపట్నం మండలంలో 15. 4 మిల్లీమీటర్లు, నగరం మండలంలో 19. 6 మిల్లీమీటర్లు, చెరుకుపల్లి మండలంలో 3. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వర్షాలకు పలు ప్రదేశాలలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa