అమరావతిలో రియల్ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి చంద్రబాబు మూడు రాజధానులను అడ్డుకుంటున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం విమర్శించారు. పుంగనూరు పర్యటనలో భాగంగా మీడియాతో ఆయన మాట్లాడారు. విభజన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పరంగా వెనుక పడిపోయింది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో చెప్పుకోదగ్గ పెద్ద నగరం లేదు. అందుకే సీఎం జగన్ మూడు రాజధానుల అంశం తెచ్చారు. చంద్రబాబుకు ఇది నచ్చలేదు. రైతుల పాదయాత్ర పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు.