చిత్తూరు: శాసనమండలి ఎన్నికల్లో ఓటర్లుగా 2019 ముందు డిగ్రీ పూర్తిచేసిన ప్రతిఒక్కరూ ఓటు వేయవచ్చని, ఆ దిశగా ఓటు నమోదు చేసుకోవాలని తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతి నగరంలో పర్యటిస్తూ ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తూ, తెదేపా అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు.